Chinese dam water bomb: ఇండియాపై డ్రాగన్ కంట్రీ భారీ కుట్ర.. చైనా వాటర్ బాంబ్ గురించి తెలుసా..?
చైనా టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ ఆనకట్టను నిర్మిస్తుండటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ప్రాజెక్టును 'వాటర్ బాంబ్'గా అభివర్ణించారు. చైనా సైనిక ముప్పు కంటే ఈ ఆనకట్టే ప్రమాదకరమని హెచ్చరించారు.