TG Crime : పోలీసు స్టేషన్‌లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

సిద్ధిపేట జిల్లా  కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో  పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.

New Update
Attempted murder by hitting a car at a police station

Attempted murder by hitting a car at a police station

TG Crime : సిద్ధిపేట జిల్లా  కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో  పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఐనాపూర్‌కు చెందిన నాయిని ప్రతాప్‌రెడ్డి, ఆలేటి రాంరెడ్డిల మధ్య కొన్నాళ్లుగా భూతగాదా సాగుతోంది. దీనిపై ఇటీవల కేసు నమోదైంది. గురువారం రాంరెడ్డి తన మిత్రులు, బంధువులతో కలిసి కొమురవెల్లిలోని హోటల్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి తన బంధువులతో కలిసి వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డాడు. కర్రలతో రాంరెడ్డిని ప్రతాప్‌రెడ్డి విచక్షణారహితంగా కొట్టాడు.

ఇది కూడా చదవండి:దంపతుల్లో పెరుగుతున్న ఒబెసిటీ ప్రమాదం.. ICMR హెచ్చరికలు తెలుసుకోండి

Also Read :  Cyber Crime: మీ ఫోన్‌కి ఈ మెసేజ్‌ వచ్చిందా ?.. బ్యాంక్ ఖాతా ఖళీ అయిపోతుంది జాగ్రత్త..

Attempted Murder By Hitting A Car At A Police Station

 తీవ్రంగా గాయపడిన రాంరెడ్డి భయంతో వారి నుంచి తప్పించుకొని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు పరిగెత్తాడు.రాంరెడ్డిని వెంబడించిన ప్రతాప్‌రెడ్డి ఠాణా ఆవరణలో అతడిని కారుతో ఢీకొట్టాడు. కింద పడిపోయిన రాంరెడ్డి చేయి విరిగింది. కాగా ప్రతాపరెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపైకి కూడా కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో పోలీసులు కూడా గాయపడ్డారు. అనంతరం  ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ప్రతాపరెడ్డి మద్యం మత్తులో ఉన్నాడని తేల్చిన పోలీసులు ప్రతాప్‌రెడ్డి, అతని అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

ఇది కూడా చదవండి:చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి

Also Read :  యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

land issues | attack | siddipet crime | siddipet crime news | Siddipet District | siddipet | komuravelli temple | komuravelli

Advertisment
Advertisment
తాజా కథనాలు