EPFO సేవలపై కీలక అప్డేట్.. ఇకనుంచి మరింత సులభంగా సేవలు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్‌లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మెంబర్ పోర్టల్‌లో PF లావాదేవీలు తెలుసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరుతో ఓ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై తమిళనాడు సీనియర్ కాంగ్రెస్ నేత కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే ఆమెని చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం సుమారుగా రూ.500 తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,264గా ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఓ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఇకనుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 2026 నుంచి పూర్తిగా అమలు చేస్తామని కంపెనీ పేర్కొంది.
అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేసే భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, వారి కుటుంబ సభ్యుల వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.
అరేబియన్ భామలు ఎంతో అందంగా ఉంటారు. నల్లగా నిగనిగలాడే కురులు, మృదువైన చర్మంతో అరేబియన్ భామలు మెరుస్తుంటారు. వీరు ఎక్కువగా అవకాడో ఫేస్ ప్యాక్, తేనె, ఆర్గర్ నూనెతో కలిపిన ప్యాక్‌లను ముఖానికి అప్లై చేస్తారు. వీటివల్ల వీరు ఎంతో అందంగా ఉంటారు.
పంజాబ్‌లోని లూధియానా జిల్లాకు చెందిన చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ యూకేలో స్థిరపడ్డాడు. మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన 71 ఏళ్ల రూపేంద్ర కౌర్ పాంధెర్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమెరికా సీటెల్‌లో నివసించే రూపేంద్ర, ఇండియా వచ్చింది.
రక్షణ వ్యవస్థను మెరుగుపర్చుకునేందుకు ఇజ్రాయెల్ కీలక అడుగులు వేస్తోంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త లేజర్ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.