/rtv/media/media_files/2025/07/18/most-wanted-criminal-encounter-in-up-2025-07-18-18-59-55.jpg)
Most wanted criminal encounter in UP
ఉత్తరప్రదేశ్ లోని పరూఖాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మను మృతి చెందాడు. మను పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మదాబాద్‌లో మను 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం కలకలం సృష్టించింది. జూన్ 28న బాలిక మృతదేహం పంటలపొలాల్లో దొరికింది. సీసీఫుటేజీ ఆధారంగా మనును ట్రేస్ అవుట్ చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.
Also Read: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం
Criminal Encounter In UP
మను మైనర్లను టార్గెట్‌గా చేసుకుని అత్యాచారం చేసి చంపేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై డజన్‌కు పైగా హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. కాగా మనుపై రూ.లక్ష రివార్డ్ కూడా ప్రకటించిన పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులపైన కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో తీవ్రగాయాలతో మను స్పాట్‌లోనే మృతిచెందాడు.
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
Also Read:ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
police | criminal | most-wanted | up-encounter | encounter | uttarpradesh