Train Accident: ఘోర విషాదం.. రైలు ఢీకొని మహిళ, కూతురు సహా నలుగురు మృతి
బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ, ఆమె కుమార్తె సహా నలుగురు వ్యక్తులు మరణించారు. మేళా చూసి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.