/rtv/media/media_files/2025/05/22/fCthrybFYtbzUwimJCwf.jpg)
Narayanapur Encounter
వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పులతో అబుజ్‌మార్ అటవీ ప్రాంతం దద్దరిల్లింది. నారాయణపూర్‌లో భద్రతా బలగాలు అబుజ్‌మార్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడినట్లు తెలిసింది.. దీంతో ఇరువర్గాలు కాల్పులకు ఉపక్రమించాయి.
Also Read: జనగణన ఆలస్యం.. మోదీ సర్కార్‌పై స్టాలిన్ సంచలన ఆరోపణలు
ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
Narayanapur Encounter
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ ఆరుగురు ఎవరు అన్నది ఇంకా నిర్ధారించలేదు. కాగా మృతదేహాలతో పాటు.. ఏకే 47 , ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఉండగా, ఎన్ కౌంటర్ కొనసాగతుందని, ఆపరేషన్ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు ముఖ్యనేతలు ఉన్నారనే సమాచారంతో ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు
Also Read : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం
chattisgarh encounter | maoist-encounter | massive maoist encounter | maoist encounter incident | chhattisgarh maoist encounter