Weather Update: మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
మరో రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు. కరీంనగర్, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.