/rtv/media/media_files/2025/07/17/couple-stabbed-in-panchayat-seven-killed-on-the-spot-2025-07-17-20-11-34.jpg)
Couple stabbed in Panchayat...seven killed on the spot
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీ లో రగడ నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో ఏడుగురు గాయాలపాలయ్యారు. కట్నం కింద ఇవ్వాల్సిన పొలం విషయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది.వివరాల ప్రకారం...
Also read : Gangraped : కారులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్..11 రోజుల పాటు ఒకరి తరువాత మరోకరు!
Also Read : Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్
Couple Stabbed In Panchayat
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామానికి చెందిన ప్రవీణ్ కి తెలంగాణ రాష్ట్రం మధిర పట్టణానికి చెందిన రాజ్యలతకు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ ఆర్ఎస్సై గా పనిజేస్తున్నాడు. వివాహం సమయంలో మూడు ఎకరాల పొలం ఇస్తామని అమ్మాయి తరుపు వారు హామీ ఇచ్చినట్లు ప్రవీణ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెళ్లి నాటి నుంచి కట్నం కింద పెట్టవలసిన మూడు ఎకరాల పొలం పెట్టాలని ప్రవీణ్ తల్లి తండ్రుల టార్చెర్ చేస్తున్నారని బాధితురాలు రాజ్యలత ఆరోపిస్తోంది.
Also Read : బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..
ఈ విషయమై జగ్గయ్యపేట మండలం చిలకల్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా -- పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.కోపంతో రాజ్యలత బంధువులపై ప్రవీణ్ బంధువులు దాడి చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమపై దాడి చేసినట్లు రాజ్యలత బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు, కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు
crime news | ntr-district | jaggaiahpet | wife-and-husband | khammam | ap-crime-news | ap-crime-report | AP Crime