USA: తహవూర్ రాణాను అప్పగించేందుకు ఒప్పుకున్న అమెరికా సుప్రీంకోర్టు
ముంబై 26/11 దాడుల కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అయింది. రాణా వేసిన రిట్ పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో అతనిని మరికొన్ని నెలల్లో భారత్ కు అప్పగించనున్నారు.