/rtv/media/media_files/2025/07/15/tesla-cars-2025-07-15-15-38-12.jpg)
Tesla Cars
దేశంలో టెస్లా కార్ల షోరూమ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. అయితే ఈ టెస్లా కార్లలో మొదట ‘మోడల్ Y’ ఈవీలను భారత్‌లో విక్రయించనుంది. దీని ధర దేశంలో రూ.61.07 లక్షలుగా నిర్ణయించింది. లాంగ్-రేంజ్ వెర్షన్ ధర అయితే రూ.69.15 లక్షలుగా ఉంది. అదే అమెరికాలో అయితే 44,990 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.38.63 లక్షలు అన్నమాట. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఈ కార్ల ధర చాలా ఎక్కువ. ఇక పోతే చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. అసలు ఎందుకు భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి? దీనికి గల కారణం ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!
🚨Tesla Model Y costs Rs 67.89 lakh in India, nearly double its $37,490 price in US. Thanks to almost 100% Tax by Gov of India.
— Vivek Singh (@VivekSi85847001) July 15, 2025
On road price is even more high.. pic.twitter.com/zrFMMnGZeN
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
దిగుమతి సుంకాల వల్ల..
టెస్లా కార్లు భారతదేశంలో చాలా ఖరీదుగా ఉండటానికి ప్రధాన కారణం అధిక దిగుమతి సుంకాలు. వేరే దేశం నుంచి కార్లను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఇవి ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు కావడంతో భారీగా దిగుమతి సుంకాలు విధిస్తుంది. రూల్ ప్రకారం 35,000 డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎలక్ట్రిక్ వాహనాలపై 15% దిగుమతి సుంకం విధించింది. ఇతర దేశాల కంపెనీలు దేశంలో 500 మిలియన్ డాలర్లు అంటే రూ.4,150 కోట్లు పెట్టుబడి పెట్టాలి.
ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
వీటిని ఏడాది 8000 యూనిట్ల వరకు తక్కువ సుంకంతో వాటిని దిగుమతి చేసుకోవచ్చు. ఇది కనుక దాటితో 70% లేదా 100% వంటి అధిక సుంకాలు వర్తిస్తాయి. అమెరికాలో టెస్లా మోడల్ వై ధర సుమారుగా రూ.38.69 లక్షలు ఉండగా.. భారత్‌లో దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు, ఇతర పన్నులు కలుపుకొని దీని ధర రూ.61.07 లక్షలుగా ఉంది. టెస్లా కార్లను దేశంలో తయారు చేయడం లేదు. అవి చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి పూర్తిగా దిగుమతి అవుతున్నాయి. దేశంలో కనుక ఫ్యాక్టరీని నిర్మిస్తే తప్పకుండా కార్ల ధరలు తగ్గుతాయి.
ఇది కూడా చూడండి:Vivo X Fold 5 Price India: అమేజింగ్.. 16GB ర్యామ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అదిరింది మచ్చా!
cars | america | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu | business news telugu | telugu business news