Ashok Gajapathi Raju: టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా!

ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు(Ashok Gajapathi Raju resigns from TDP). గోవా గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుకు లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు గోవా గవర్నర్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


ఇది కూడా చదవండి: కూటమి నేతలకు గుడ్‌న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ

Ashok GajapathiRaju

ఆవిర్భావం నుంచి టీడీపీలోనే..

అశోక్ గజపతి రాజు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కూడా పని చేశారు. 2014లో ఎంపీగా విజయం సాధించిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఆయన పని చేశారు. గత ఎన్నికల్లో ఆయన పోటీకి దిగకుండా.. కూతురిని బరిలోకి దించారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే.. పార్టీకి ఆయన చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ గా అవకాశం కల్పించింది టీడీపీ. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించగా.. కేంద్రం కూడా ఓకే చెప్పింది. 


ఇది కూడా చదవండి:AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హత, చివరితేదీ వివరాలివే

Advertisment
Advertisment
తాజా కథనాలు