Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

New Update
0

Zomato New Feature: 

ఆహారాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో  జొమాటో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా చాలా తక్కువ ధరలకే ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు రద్దు చేసిన ఆర్డర్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రద్దు చేసిన ఆర్డర్‌లను జొమాటో ఏమాత్రం ప్రోత్సహించదని ఆయ చెప్పారు. ఆర్డర్ క్యాన్సల్ చేయడం ద్వారా ఆహారం వృథా అవుతోందని..అందుకే జొమాటోలో ఇక మీ ఠిన విధానాలను అమలు చేసతామని చెప్పారు. ఇప్పటికే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే నో-రీఫండ్ పాలసీ ఉంది. అయినా కూడా కస్టమర్లు 4 లక్షల ఆర్డర్‌లను రద్దు చేశారని గోయల్ చెప్పారు. ఇది మాకు ఆందోళన కలిగించే అంశమని, ఆహారాన్ని వృధా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అరికట్టాలని భావించామని తెలిపారు. అందుకే ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. 

Also Read:నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

Also Read: వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ

మరోవైపు ఒ కస్టమర్ ఆర్డర్ రద్దు చేస్తే.. అప్పుడు దానిని కొత్త కస్టమర్ ఒకవేళ క్లెయిమ్ చేస్తే.. అతను అమౌంట్‌లో కొంత భాగాన్ని డిస్కౌంట్ పొందుతాడు. ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌లో పాల్గొనకూడదనుకునే భాగస్వాములు తమ భాగస్వామి యాప్, డ్యాష్‌బోర్డ్‌ని ఉపయోగించి సులభంగా నిలిపివేయవచ్చు. కొత్త కస్టమర్‌కు ప్రారంభ పికప్, చివరి డెలివరీతో సహా మొత్తం సేవ కోసం డెలివరీ భాగస్వామికి చెల్లించబడుతుంది.

Also Read:నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్

Also Read: Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా  

Advertisment
తాజా కథనాలు