Russian Woman Husband Cave: అడవిలో ఒంటరిగా జీవించిన రష్యా మహిళ.. ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన భర్త

కర్ణాటకలోని ఓ అడవిలో రష్యా మహిళ నీనా కుటినా(40) తన ఇద్దరు పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె భర్త డ్రోర్ గోల్ట్ స్టెనిన్(38) అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి గురువారం బెంగళూరుకి వచ్చాడు.

New Update
Left Goa Without Informing Me, Husband Of Russian Woman Found Living In Karnataka Cave

Left Goa Without Informing Me, Husband Of Russian Woman Found Living In Karnataka Cave

Russian Woman Husband Cave:

గత కొంతకాలంగా కర్ణాటకలోని గోకర్ణకు సమీపంలో ఉన్న అడవిలో రష్యా మహిళ నీనా కుటినా(40) తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె సమాచారం తెలియడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె భర్త డ్రోర్ గోల్ట్ స్టెనిన్(38) అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి గురువారం బెంగళూరుకి వచ్చాడు. 

Also Read: బంగ్లాదేశ్‌ నుంచి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం.. అదే జరిగితే భారత్ ఒంటరి!

ఆమెతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని అతడు పోలీసులను అభ్యర్థించాడు. ఆమెకు సంబంధించిన వివరాలు వాళ్లకు వెల్లడించాడు. '' గతంలో మేమిద్దరం గోవాలో ఉన్నప్పుడు ఒకే కంపెనీలో పని చేశాము. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డాం. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నా కూడా కలిసే జీవించాం.  గతేడాది పనికోసం ఇజ్రాయెల్ వెళ్లాను. మేము తరచూగా ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. అయితే మార్చి నుంచి నీనా కుటినాకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు. 

Also Read: రాహుల్ కోసం అస్సాం జైళ్ళు వెయిటింగ్..విరుచుకుపడ్డ సీఎం హిమంత బిస్వా

దీనిపై అప్పుడే పణజీ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాను. గోకర్ణ సమీపంలోని అడవిలో ఓ గుహలో ఆమె తన పిల్లలతో కలిసి రహస్యంగా ఉంటుందని.. పోలీసులు వాళ్లని రక్షించారని తెలిసింది. అందుకే ఇజ్రాయెల్ నుంచి ఇక్కడికి వచ్చానని అతడు పోలీసులు చెప్పాడు. అంతేకాదు కుటుంబ నిర్వహణ కోసం ప్రతినెలా రూ.3.5 లక్షలు కూడా పంపుతున్నానని తెలిపాడు. ఆమె ఎప్పుడూ కూడా ప్రకృతి మధ్యలోనే పిల్లలను పెంచాలని అనుకునేదని.. అందుకే అడవిలోకి(Forest) వెళ్లి ఉండొచ్చని స్పష్టం చేశాడు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు