Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది.

New Update
stock

Stock Market Today

అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలున్నాయి. కానీ ఈరోజు దేశీయ మార్కెట్లు మాత్రం లాభాల్లో పయనిస్తున్నాయి. కనిష్టాల దగ్గర కొనుగోళ్ళకు మద్దతు లభించడమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  దీని ప్రభాం వల్లనే నిన్న దేశీ మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయినప్పటికీ ఈ రోజు కోలుకున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం అయిన సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 24 లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, టాటా మోటార్స్, బిఇఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సిఎల్ టెక్, జొమాటో 2.7% వరకు నష్టపోయాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 40 స్టాక్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. NSEలోని అన్ని రంగాలు కూడా ఊపందుకున్నాయి. మీడియా అత్యధికంగా 1.15% లాభపడింది. ఆటో, రియాల్టీ 1% వరకు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.97గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్..

ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.12% తగ్గి 39,507 వద్ద, కొరియా కోస్పి 0.13% తగ్గి 3,198 వద్ద ట్రేడవుతున్నాయి.
హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.025% పెరిగి 24,197 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.93% తగ్గి 3,487 వద్ద ముగిసింది. ఇక జూలై 14న అమెరికా డౌ జోన్స్ 0.20% పెరిగి 44,460 వద్ద ముగిసింది. అదే సమయంలో, నాస్‌డాక్ కాంపోజిట్ 0.27% పెరిగి 20,640 వద్ద, ఎస్ అండ్ పి 500 0.14% తగ్గి 6,269 వద్ద ముగిశాయి. జూలై 14న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.1,614.32 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో.. దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.1,787.68 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: Ramayana: వామ్మో అంత డబ్బులా..రామాయణానికి బడ్జెట్ రూ.4 వేల కోట్లు

Advertisment
తాజా కథనాలు