/rtv/media/media_files/2025/07/18/cm-siddaramaiah-2025-07-18-17-54-30.jpg)
CM Siddaramaiah releases 50 crores to each MLA amid pressure over fund shortage
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో దీనిపై సుధీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక పార్టీ ఇంఛార్జి రణదీప్ సూర్జేవాలా దగ్గరికి ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవడం లేదని వాపోయారు.
Also read: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
Also Read : మీ శరీర బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినాల్సిందే
CM Siddaramaiah Releases 50 Crores To Each MLA
దీంతో బెంగళూరులోని పార్టీ ఆఫీస్‌లో రణదీప్ సూర్జేవాలా విడివిడిగా ఎమ్మెల్యేలతో మాట్లాడారు. నిధుల రాక ఆలస్యం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యేలు చెప్పారు. చివరికి ఈ విషయాన్ని ఆయన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై చర్చలు జరిగిన అనంతరం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారు. దీనివల్ల ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల గ్రాంట్ రానుంది.
Also read: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది..
నిధుల ఆలస్యం విషయంలో ఎమ్మెల్యేలు గత కొంత కాలంగా అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జూన్‌లో కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కగే.. సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు వెళ్లడం లేదని.. నిధులు రాక తాను నిరాశ చెందినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా పార్టీ రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు. దీంతో ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.
Also Read : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!
karnataka | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu