/rtv/media/media_files/2025/07/18/yulia-sviridenko-is-the-new-prime-minister-of-ukraine-2025-07-18-17-23-36.jpg)
Yulia Sviridenko is the new Prime Minister of Ukraine
UKRAINE : రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రభుత్వంలో భారీగా మార్పులు చేశారు. ఉక్రెయిన్‌కు కొత్త ప్రధానిని నియమించారు. ఇప్పుడు ఈ నిర్ణయం రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. మూడేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్రెయిన్ తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా డెనిస్ ష్మిహాల్ స్థానంలో దేశ ఆర్థిక మంత్రి యూలియా స్విరిడెంకోను కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాలతో యూలియాను ప్రధానిగా ఎంపిక చేశారు జెలెన్ స్కీ. అయితే గత ఐదేళ్లలో ఉక్రెయిన్‌కు కొత్త ప్రధాని రావడం ఇదే మొదటి సారి.
Also Read:Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
39 ఏళ్లకే యూలియా ఉక్రెయిన్ప్రధానిగా బాధ్యతలు
2021 నుంచి ఈమె రక్షణమంత్రిగా ఉన్నారు. గతంలో అమెరికాతో కీలకమైన ఖనిజాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. అలాగే మరెన్నో దేశాలతో ఆమెకు దౌత్యంలో కూడా అనుభవం ఉంది. అయితే ఇప్పుడు ప్రధాని యూలియా ముందు అతిపెద్ద బాధ్యతలు ఉన్నాయి. దేశీయ ఆయుధ ఉత్పత్తిని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, విదేశీ సహాయంపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం వంటి బాధ్యతలను జెలెన్ స్కీ ఆమెకు అప్పగించారు. ఇక ఈమె స్థానంలో ఆర్థిక మంత్రిగా డెనిస్ ష్మిహాల్ నియమితులయ్యారు. ఉక్రెయిన్ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన గుర్తింపు పొందారు ష్మిహాల్.
Also Read : బీజేపీ లో మాధవీలత చిచ్చు..పార్టీ లైన్ దాటి...
ఇదిలా ఉండగా.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా దళాలు వెయ్యి కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఫ్రంట్‌లైన్ వెంబడి దాడులను కొనసాగిస్తోంది. అటు ఉక్రెయిన్ నగరాలపై వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి. విదేశీ సహాయం తగ్గుతున్న నేపథ్యంలో దేశం సుమారు 19 బిలియన్ల డాలర్ల బడ్జెట్ లోటును ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ నియామకంతో ఉక్రెయిన్ పరిస్థితి మారుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఒమన్‌లో కొత్త వర్క్ రూల్.. ఆ పని అందరూ చేయాల్సిందే
Also Read : బీఆర్‌ఎస్ కు షాక్...కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మునిసిపల్ చైర్మన్
zelenskyy | Volodymyr Zelenskyy | ukraine-zelenskyy | new-pm | russia in ukraine | russia and ukraine war | russia attack ukraine