Sangareddy: ఈ పాపం ఎవరిది? రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ నరకయాతన.. మార్గమధ్యలోనే ప్రసవం..
సంగారెడ్డి జిల్లా మున్యా నాయక్ తండా లోకి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. గ్రామానికి చెందిన ఒక యువతి గర్భం దాల్చింది. అయితే తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు మార్గం లేక గర్భిణీ అష్ట కష్టాలు పడింది. దీంతో మధ్యలోనే ప్రసవించింది.