Divorce: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

బాంబే హైకోర్టు విడాకులకు సంబంధించి సంచలన తీర్పునిచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరించినా కూడా విడాకులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించడం, శృంగారానికి నిరాకరించడం అనేవి క్రూరత్వంతో సమానమని పేర్కొంది.

New Update
Bombay High Court Sensational Comments Divorce

Bombay High Court Sensational Comments Divorce

బాంబే హైకోర్టు విడాకులకు సంబంధించి సంచలన తీర్పునిచ్చింది. భర్తతో శృంగారానికి భార్య నిరాకరించినా కూడా విడాకులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించడం, శృంగారానికి నిరాకరించడం అనేవి క్రూరత్వంతో సమానమని పేర్కొంది. విడాకులు తీసుకునేందుకు వీటిని కారణాలుగా చూపించవచ్చని తేల్చిచెప్పింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.  

Also read: మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడో తెలిసిపోయింది..

Bombay High Court Comments On Divorce

ఇక వివరాల్లోకి వెళ్తే.. విడాకులకు పర్మిషన్ ఇస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. తనకు భర్త నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఆమె తన భర్తను తోటి ఉద్యోగులు, స్నేహితులతో ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని తెలిపింది. అలాగే దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆయన కుటుంబ పట్ల సరిగా ఉండకపోవడం కూడా అతడి బాధకు కారణాలని పేర్కొంది. 

Also Read: ఏడు సంవత్సరాలుగా మూసి ఉన్న ఇల్లు..బాలు కోసం వెళ్లిన యువకునికి షాకింగ్‌ దృశ్యం

2013లో ఈ జంటకు వివాహం జరిగింది. తర్వాతి ఏడాది నుంచి ఆమె భర్తతో విడిగా ఉంటోంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు తనకు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించి వేధిస్తోందని భర్త ఆరోపణలు చేశాడు. అలాగే తన కుటుంబీకులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు కూడా ఇబ్బంది పెట్టి హింసించేదని వాపోయాడు. ఆమె తీరు వల్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని.. తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పుణెలో అతడు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. దీనికి అక్కడి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కానీ దీన్ని సవాలు చేస్తూ అతడి భార్య.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. 

Also Read: కారులో వృద్ధుడిని కట్టేసి.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఫ్యామిలీ!

Also Read :  ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

Bombay High Court | divorce | national-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు