Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో వారి మృతదేహాలను పాతిపెట్టాడు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. అంతటితో ఆగకుండా తన భార్య, అత్త కొంతకాలంగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.