Dolly chaiwala: డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు భారీ డిమాండ్.. 1600 దరఖాస్తులు!

నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.

New Update
Dolly chaiwala

Dolly chaiwala

ఓ చిన్న టీ కొట్టు నడుపుకునే ఓ వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఫ్రాంచైజీతో పాటు వీటికి భారీ డిమాండ్ రావడం ఇంకా గొప్ప విషయం. వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన డాలీ చాయ్‌వాలా అనే వ్యక్తి బతుకు తెరువు కోసం టీ అమ్ముకునేవారు. తన టీ టేస్ట్ బాగుండటంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. డాలీ చేసిన టీ ఒక్కసారి తాగితే.. మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. దీంతో డాలీ చాయ్‌కు భారీగా డిమాండ్ పెరిగింది.

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

డాలీ కీ తప్రి పేరుతో..

నాగ్‌పూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు తన టీ స్టాల్‌కు వచ్చేవారు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి మరి టీ తాగడానికి వెళ్లేవారు. ఇటీవల ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ కూడా తన చాయ్ తాగారు. దీంతో డాలీ చాయ్ ఇంకా ఫేమస్ అయ్యారు. అయితే డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించాలని ప్రకటించారు.

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించాలని ప్రకటించారు.

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

డాలీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తను బడికి వెళ్లి చదువుకోలేదని, కానీ వచ్చిన అవకాశాలను వదులుకోలేదన్నారు. టీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తనతో పాటు ఇతరులు కూడా ఎదగాలని ఫ్రాంచైజీ ఇస్తున్నాని తెలిపారు. దీంతో నెటిజన్లు ఈ చాయ్‌ ఫ్రాంచైజీకి ఇంత డిమాండ్ ఏంటని కామెంట్లు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు