🔴Live News Updates: హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

https://rtvlive.com/cinema/tollywood-actor-fish-venkat-best-telugu-comedy-movies-9511673

Also Read: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. టూరిస్టుల మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. ప్రపంచమంతా ఆ దాడిని ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్..పాక్ పై దాడులు చేపట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. తర్వాత పాక్ కూడా కాల్పులు నిర్వహించింది. తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఘటనపై అమెరికా ఇప్పుడు మళ్ళీ స్పందించింది.

Also Read: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థే..

పహల్గాందాడిని తామే చేశామని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఆధ్వర్యంలో ఇది పని చేస్తోంది. అయితే ఈ దాడి ముందు వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు అమెరికా ఈ టీఆర్ఎఫ్ ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో చెప్పారు. ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌’ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు తెలిపారు.  

Also Read: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్

2008 తర్వాత భారత్ లో ముంబయ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన అతి పెద్ద అటాక్ పహల్గామేనని మార్క్ రూబియో అధికారిక ప్రకటన చేశారు. అలాగే అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలన నిబద్ధత అని చెప్పారు. 

Also Read: మా సంగతి మేం చూసుకుంటాం..నాటో చీఫ్ కు భారత్ ఘాటు సమాధానం

  • Jul 18, 2025 21:18 IST

    నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

    ఇటీవల నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ముందు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.

     

    FotoJetUkrainian sabotage suspected as Russian soldiers die from poisoned water in Donetsk (9)
    Ukrainian sabotage suspected as Russian soldiers die from poisoned water in Donetsk

     



  • Jul 18, 2025 21:17 IST

    నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌. ఆరుగురు మృతి

    వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్‌ తగిలింది. ఛత్తీస్‌‌‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో  ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

     



  • Jul 18, 2025 21:17 IST

    హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా

    హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వ‌ర్షానికి అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వరద రావడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి స‌హాయ‌క చ‌ర్యల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

    Heavy floods in Hyderabad.. Hydra enters the scene



  • Jul 18, 2025 19:09 IST

    కేసీఆర్‌ ఎందుకు ఏడుపు, పాలమూరుకు ఏం చేశావ్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

    ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్‌ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

     

    CM Revanth Sensational Comments on KCR
    CM Revanth Sensational Comments on KCR

     



  • Jul 18, 2025 19:09 IST

    మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!

    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని హెచ్చరించారు.

    Chandrababu Vs Revanth Reddy



  • Jul 18, 2025 19:08 IST

    యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

    ఉత్తరప్రదేశ్‌ లోని పరూఖాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్‌ కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ మను మృతి చెందాడు. మను పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మదాబాద్‌లో మను 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం కలకలం సృష్టించింది.

    Most wanted criminal encounter in UP



  • Jul 18, 2025 18:12 IST

    SIIMA 2025: 'సైమా' ఉత్సవానికి డేట్స్ ఫిక్స్ .. ఈ సారి కూడా అక్కడే?

    సౌత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న SIIMA  2025( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)  వేడుకకు  రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ 'సైమా' ఈవెంట్ కి  సంబంధించిన   తేదీలను  ప్రకటించారు.

     

    SIIMA 2025
    SIIMA 2025

     



  • Jul 18, 2025 18:11 IST

    పోలీసు స్టేషన్‌లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

    సిద్ధిపేట జిల్లా  కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో  పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.

    Attempted murder by hitting a car at a police station



  • Jul 18, 2025 17:50 IST

    ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

    రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రభుత్వంలో భారీగా మార్పులు చేశారు. అందులో భాగంగా డెనిస్‌ ష్మిహాల్‌ స్థానంలో దేశ ఆర్థిక మంత్రి యూలియా స్విరిడెంకోను కొత్త ప్రధానిగా నియమించారు.

    Yulia Sviridenko is the new Prime Minister of Ukraine



  • Jul 18, 2025 16:55 IST

    అక్రమ సంబంధం పెట్టుకుందని.. తల్లిని కిరాతకంగా చంపిన కొడుకు!

    చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ గొల్లవానికుంటలో నివాసం ఉండే శారధ  (37) అనే మహిళను ఆమె కొడుకు హత్య చేశాడు. తల్లి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని పిడిగుద్దులతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేశాడు.

    Son brutally kills mother!



  • Jul 18, 2025 16:23 IST

    బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...

    బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్‌ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

    Madhavilatha



  • Jul 18, 2025 15:24 IST

    భారత అమ్ములపొదిలో మరో ఆయుధం..ఏకే 203..

    భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. అందులో భాగంగా కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది. నిమిషానికి 700  రౌండ్లు ఫైర్ చేయగల ఈ రైఫిల్‌లు త్వరలోనే సైన్యానికి చేరనున్నాయి.

    AK-203 Rifle



  • Jul 18, 2025 15:23 IST

    కారులో వృద్ధుడిని కట్టేసి.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఫ్యామిలీ!

    మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం తాజ్‌ మహల్ సందర్శన కోసం వెళ్లారు. కారును శిల్ప్‌గ్రామ్ పార్కింగ్‌లో ఉంచి.. 80 ఏళ్ల వృద్ధుడిని కారులోనే వదిలేసి వెళ్లారు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్న అతడిని పార్కింగ్ సిబ్బంది బయటకు తీసి రక్షించారు.



  • Jul 18, 2025 14:53 IST

    మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. బీజేపీలోకి ఉద్ధవ్‌ ఠాక్రే ?

    ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేన (UBT) చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రే.. మళ్లీ బీజేపీతో కలవనున్నట్లు ప్రచారం నడుస్తోంది. గురువారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అవ్వడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది.

     

    Uddhav Thackeray meets Devendra Fadnavis day after 'join us after 2029' remark
    Uddhav Thackeray meets Devendra Fadnavis day after 'join us after 2029' remark

     



  • Jul 18, 2025 14:52 IST

    హైదరాబాద్‌లో అరాచక భర్త.. భార్య పుట్టింటికి పోయొచ్చేలోగా.. ఏం చేశాడో తెలుసా!?

    హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ భర్త అరాచకం బయటపడింది. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన నికిత అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చి కొన్ని నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఇంతకు భర్త నల్లూరి శ్రవణులు ఆమెకు తెలియకుండానే ఇల్లు అమ్మేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

     

    Hyderabad Crime News
    Hyderabad Crime News

     



  • Jul 18, 2025 13:57 IST

    Best 5 Camera Smartphones: ఉఫ్ ఉఫ్.. రూ.20వేల లోపు బెస్ట్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్స్ - ఏకంగా 108MPతో

    Flipkartలో రూ.20వేల లోపు అద్భుతమైన కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇవి మెరుగైన కెమెరా పనితీరును అందిస్తాయి. అందులో Motorola G85 5G, Samsung Galaxy F36 5G, POCO M6 Plus 5G, ealme P3x 5G, Tecno Pova 7 5G / Tecno Pova 7 Pro 5G ఫోన్లు ఉన్నాయి.

     

    best 5 camera smartphones under Rs 20,000 in flipkart
    best 5 camera smartphones under Rs 20,000 in flipkart

     



  • Jul 18, 2025 13:21 IST

    HYD Software Employee: అయ్యో బిడ్డా.. నెలకు రూ.2లక్షల జీతగాడు.. లవర్ వదిలేసిందని సూసైడ్

    వాలివేటి హితేష్ అనే 29 ఏళ్ల యువకుడు అతి చిన్న వయస్సులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. నెలకు రూ.2లక్షల జీతం తీసుకుంటున్నాడు. కానీ తన లవర్ బ్రేకప్ చెప్పడంతో HYD రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉరేసుకున్నాడు.

     

    Hyderabad Software Employee Incident
    Hyderabad Software Employee Incident

     



  • Jul 18, 2025 13:20 IST

    BIG BREAKING: టీడీపీకి అశోక్ గజపతిరాజు రాజీనామా!

    ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పార్టీకి రాజీనామా చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

    Ashok Gajapathi Raju



  • Jul 18, 2025 12:43 IST

    Telangana Villages : అప్పుడు 5 మండలాలు.. ఇప్పుడు 14 గ్రామాలు.. తెలంగాణకు బీజేపీ సర్కార్ మరో షాక్?

    తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందంటూ మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చేసిన ప్రకటన  సంచలనంగా మారింది.

    maharastra-vs-telangana



  • Jul 18, 2025 11:23 IST

    Bangladesh: ముజీబ్, ఠాగూర్, ఇప్పుడు సత్యజిత్ రే..భారత్ తో బంగ్లాదేశ్ తెగతెంపులు చేసుకుంటోందా?

    బంగ్లాదేశ్ తన గతాన్ని,సాంస్కృతిక చరిత్రను ,భారతదేశంతో తన భాగస్వామ్య వారసత్వాన్ని వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముజీబ్, ఠాగూర్ల ఇళ్ళ తర్వాత ఇప్పుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేత తో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

     

    bangla
    Mujib, Tagore, Satyajit Ray

     



  • Jul 18, 2025 11:23 IST

    Assam CM: రాహుల్ కోసం అస్సాం జైళ్ళు వెయిటింగ్..విరుచుకుపడ్డ సీఎం హిమంత బిస్వా

    అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జైలుకు వెళ్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు దానిపై హిమంత స్పందించారు.  రాహుల్ కోసం అస్సాం జైళ్ళు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఆయన ప్రసంగాల వలన ఆక్రమణదారులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు.

     

    himantha
    Assam CM Himantha Biswa Sarma

     



  • Jul 18, 2025 09:42 IST

    USA: ట్రంప్ లో ఆ లోపం ఉంది..వైట్ హౌస్

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది.  దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. అయితే ఇది సాధారణ వ్యాదేనని..కంగారుపడవలసిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు. 

     

    trump health
    White House Announcement On Trump Health

     



  • Jul 18, 2025 09:42 IST

    Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దంచికొడుతున్నాడు. ప్రస్తుతం 425 రన్స్ తో సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్న పంత్..మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు. 

     

    Rishabh Pant
    Rishabh Pant Photograph: (Rishabh Pant)

     



  • Jul 18, 2025 09:40 IST

    AAIB: ఏం జరిగిందో చెప్పాం..దర్యాప్తు ఇంకా పూర్తవలేదు..ఏఏఐబీ

    ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. దీంతో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని..అప్పుడే నిర్ధారణకు రావొద్దంటూ ఏఏఐబీ స్పష్టం చేసింది. 

     

    Air India Crash victims' families claim forced financial disclosures
    Air India Crash victims' families claim forced financial disclosures

     



  • Jul 18, 2025 09:39 IST

    USA: ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన

    పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో అమెరికా కీల నిర్ణయం తీసుకుంది. దానిని ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. లష్కరే తోయిబా ముసుగులో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ అని చెప్పింది. 

     

    Trump
    Trump

     



  • Jul 18, 2025 08:02 IST

    BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్

    కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. సీనియర్‌ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్‌బుక్‌తో అప్‌లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసింది.

     

    CM Siddaramaiah
    CM Siddaramaiah

     



  • Jul 18, 2025 08:01 IST

    ఢిల్లీ కోర్టులో వింత శిక్ష.. ఏంటో తెలిస్తే షాక్!

    కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు నలుగురికి న్యాయమూర్తి తగినబుద్ధి చెప్పారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు నిందితులకు ఢిల్లీ న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. చేతులు పైకెత్తి కోర్టు హాలులో రోజంతా నిలబడాలని ఆదేశించింది.

    Delhi High Court



  • Jul 18, 2025 08:01 IST

    Telangana Rain Update: తెలంగాణలో జోరువాన.. ఈ జిల్లాల్లో దంచికొట్టేస్తుంది

    తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రాబోయే 2 గంటలు ఆగకుండా మధ్యస్తంగా నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాలలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

     

    Telangana Rain Update (1)
    Telangana Rain Update

     



  • Jul 18, 2025 07:03 IST

    Ind Vs Eng: టీమిండియాకు బిగ్ షాక్.. అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

    ఇంగ్లాండ్‌తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. దీంతో అతని టెస్టు అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. బుమ్రాకు విశ్రాంతిస్తే అర్ష్‌దీప్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.

     

    arshdeep singh injured ahead of 4th test team india fast bowler
    arshdeep singh injured ahead of 4th test team india fast bowler

     



  • Jul 18, 2025 07:02 IST

    Snake Bite: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్

    మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో దీపక్ మహావర్ పేరుపొందాడు. ప్రజలకు సేవ చేసిన ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

     

    Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh
    Deepak Mahawar died after being bitten by snake in Madhya Pradesh

     



  • Jul 18, 2025 07:01 IST

    Road Accident: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

    హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదిభట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి బెంగుళూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



Advertisment
తాజా కథనాలు