Municpal Election Result: నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ చరిత్ర సృష్టించింది. ట్రాన్స్‌జెండర్ వర్గం నుంచి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నుండి నాగిళ్ల సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జయకేతనాన్ని ఎగురవేసింది.
తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు కూడా క్యూ లైన్లో నిలబడి వారి ఓటు వేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన పలువురు నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ప్రకటించారు.
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి తెలంగాణకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు మొత్తం 5 ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా..హరీష్ పైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు.