/rtv/media/media_files/2025/05/26/V3YzCZUn7BD2modDmuJz.jpg)
Potests against muhammad yunus interim govt in Bangladesh
Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌తో ప్రమాదం ఉండగా.. మరో వైపు నుంచి భారత్‌కు ప్రమాదం ముందుకొస్తోంది. పాకిస్తాన్, చైనాతో మనకు శత్రత్వ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా పొరుగు దేశాల్లో గతకొన్ని నెలల వరకూ బంగ్లాదేశ్ ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారుతోంది. దాని వల్ల భవిష్యత్‌లో భారత్‌కు పెద్ద ప్రమాదం ముంచుకురాబోతుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్ధాం..
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, దేశంలోనూ, వెలుపలా ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. మహ్మద్ యూనస్ ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్ మతఛాందసవాద శక్తులను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గతంలో ఇండియాకు విదేయంగా ఉండే బంగ్లాదేశ్ ఇప్పుడు విభేదాలకు గురుతుంది. ప్రపంచ దేశాలతో బంగ్లాదేశ్ సంబందాలు పెరుగుతుండటంతో సరిహద్దులో భారతదేశం పట్ల ఆందోళనను పెంచింది. బంగ్లాదేశ్ నిపుణులు కూడా ఈ ప్రమాదం గురించి భారతదేశాన్ని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ముస్లీం దేశంగా మారితే.. ఇప్పుడు పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ నుంచి కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు బంగ్లాదేశ్ భారత్ వైఖరిని తప్పుబడుతుంది. ద్వేషాన్ని పెంచుకుంటుంది.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇండియా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ సలావుద్దీన్ షోయబ్ చౌదరి భారతదేశాన్ని హెచ్చరించారు. మహ్మద్ యూనస్ ఇదే మార్గంలో కొనసాగితే, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశంగా మారే అవకాశం ఉన్నందని ఆయన అన్నారు. ఇప్పటికే బంగ్లాదేశంలో హిందూవులపై, హిందూ దేవాలయాలపై దాడులు పెరుతున్నాయి. మొత్తం ప్రాంతంలో అస్థిరత వ్యాపిస్తుంది. భారతదేశం ముఖ్యంగా దీని ప్రభావానికి గురవుతుంది. ఎందుకంటే రెండు దేశాలకు ఉమ్మడి సంస్కృతి ఉంది.
ఉన్నత పదవుల్లో 17వేల మంది యూనుస్ అనుచరులు
గత 11 నెలల్లో యూనుస్ ప్రభుత్వం భద్రతా వ్యవస్థలో పెద్ద మార్పులు చేసిందని షోయబ్ చౌదరి చెప్పారు. రాడికల్ ఇస్లాం నేపథ్యం ఉన్న పోలీసులు, సరిహద్దు గార్డు, కోస్ట్ గార్డులలో 17వేల మంది కొత్త వ్యక్తులను నియమించారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్, ఇప్పుడు మొహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్‌గా మారుతుందని ఆయన వివరించారు.
ఎలాంటి అర్హతలు చూడకుండా యూనస్ కేవలం ముస్లీం వ్యక్తులను సైన్యంలో ఉన్నత పదవుల్లో నియమించాడు. అందులో చాలామందికి సెల్యూట్ చేయడం కూడా రాదు. వారికి శిక్షణ ఇస్తున్నారు. యూనస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ మార్పులు బంగ్లాదేశ్ భద్రతా వ్యవస్థలో ఇస్లామీకరణ జరుగుతోందని అర్ధమవుతోంది.
పాకిస్తాన్, టర్కీలతో దోస్తీ
బంగ్లాదేశ్ దేశానికి పాకిస్తాన్, టర్కీలతో దౌత్యసంబంధాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఆ దేశాలు సాహాయం చేస్తున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఉంది. మరోవైపు, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభావం కూడా బంగ్లాదేశ్‌లో పెరుగుతోంది.
ఈ నెలలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ ముస్లిం NGOల సమూహానికి ఆతిథ్యం ఇచ్చింది. దీని గురించి మొహమ్మద్ యూనస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేయడమే ఈ సమావేశం ఉద్దేశ్యం అని స్పష్టంగా రాశారు.
ఎర్డోగన్ ప్రభావం..
టర్కీ, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా నుండి ఇస్లామిక్ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇంతలో, బంగ్లాదేశ్‌లో కూడా టర్కీ ప్రభావం పెరుగుతోంది. టర్కీ రక్షణ పరిశ్రమ కార్యదర్శి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌ను కలిశారు. దీనిలో టర్కీ బంగ్లాదేశ్‌కు కలిసి సైనిక పరికరాలను తయారు చేయాలని ప్రతిపాదించింది. ఎర్డోగన్ భావజాలాన్ని బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియాలో వ్యాప్తి చేయడానికి ఇది ఒక ప్రయత్నంగా భావిస్తున్నారు.