Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!

ప్రపంచ విమానశ్రయాల్లో మేటి విమానాశ్రయంగా పేరున్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది మొదలు నుంచి మే నెల చివరివరకు కేవలం ఐదు నెలల కాలంలో విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో పక్షులు ఢీ కొన్న ఘటనలు కలకలం రేపాయి.

New Update
Shamshabad Airport

Shamshabad Airport

Shamshabad Airport : ప్రపంచ విమానశ్రయాల్లో మేటి విమానాశ్రయంగా పేరున్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది మొదలు నుంచి మే నెల చివరివరకు కేవలం ఐదు నెలల కాలంలో విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో పక్షులు ఢీ కొన్న ఘటనలు కలకలం రేపాయి. ఇలా ఐదు నెలల్లో 49 సార్లు పక్షులు ఢీ కొన్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వివరించింది. దానితో పాటు అదే ఐదు నెలల కాలంలో దేశంలో 11మేడే కాల్స్‌(ఆకాశంలో విమానం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రౌండ్‌కు ఇచ్చే సంకేతం) వచ్చినట్లు డీజీసీఏ నిర్ధారించింది, అందులో ఐదు హైదరాబాద్‌ గగనతలంలో ఉన్న విమానాల నుంచి వచ్చినవి కావడం గమనార్హం. 

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

New Threat To Shamshabad Airport

విమానాశ్రయాల్లో ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయాల్లో పక్షులు లేదా జంతువులు ఢీకొన్న సంఘటనలు దేశవ్యాప్తంగా ఏటా 2వేల వరకు నమోదవుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. ఢిల్లీ, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో పక్షుల బెడద ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ ఘటనలు.. ఢిల్లీలో ఏటా సగటున 400 దాకా నమోదు కావడం గమనార్హం. అక్కడ ఈ ఏడాది జనవరి 1 నుంచి మే నెలాఖరు వరకూ ఇలాంటి ఘటనలు 95 వరకు నమోదయ్యాయి.  అలాగే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈ కాలంలో 49 పక్షులు ఢీకొన్న ఘటనలు జరిగాయని డీజీసీఏ తెలిపింది. ఇలాంటి ఘటనలు 2022లో 92 , 2023లో 136, 2024లో 143 నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు విమానశ్రయ భద్రతపై అందోళన నెలకొంది.

Also Read:Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పక్షుల బెడదను తగ్గించేందుకు జీఎంఆర్‌ చర్యలు చేపట్టింది. రన్‌వే సమీపంలో పక్షులను తగ్గించేందుకు అధిక తరంగదైర్ఘ్యంతో శబ్దాలు చేసే స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఈ శబ్ధం వల్ల పక్షులు అక్కడికి రావడానికి జంకుతాయని వాటికోసమే  తయారు చేసిన ఈ పరికరాలు నిరంతరం పనిచేస్తుంటాయి. అలాగే.. పక్షులను మరింత భయపెట్టేందుకు రన్‌వేలకు రెండు వైపులా ప్రతి పావుగంటకు ఒకసారి పాటాకులు కాలుస్తున్నారు. దీనికోసం కొంతమందిని ప్రత్యేకంగా నియమించారు. పక్షులు చేరకుండా ఎప్పటికప్పుడు గడ్డి తొలగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో  చెత్త, కుళ్లిన ఆహార పదార్ధాలు ఓపెన్‌ నిల్వలు లేకుండా చర్యలు చేపట్టారు. అయితే ఎయిర్‌ పోర్టు పరిసరాల్లోని కాటేదాన్‌, జల్‌పల్లి ప్రాంతాల్లో కొందరు.. నిబంధనలకు విరుద్ధంగా జంతు కళేబరాలు, ఇతర వ్యర్థ పదార్థాల నుంచి నూనె తీసే పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పక్షుల బెడద పెరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటిని మూసివేయించాలని ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. వీటిని మూస్తే పక్షుల నియంత్రణ కొంతమేర మెరుగు పడుతుందని భావిస్తున్నారు.

Also Read: Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

may-day | birds | high alert in shamshabad airport | threat call to shamshabad airport | shamshabad airport latest news

Advertisment
Advertisment
తాజా కథనాలు