BIG BREAKING: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. మళ్లీ అరెస్ట్?
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.
విజయవాడ గవర్నర్ పేటలో క్యాటరింగ్ చేసే ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.
నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలిక చీరేస్తామని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసే అర్హత నానికి లేదన్నారు. తాతల కాలం నుండే తమ ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ట్రాక్టర్ను కంటైనర్లో ఎత్తుకెళ్లారు. జూలై 8న పార్క్ చేసిన ట్రాక్టర్ మరుసటి రోజు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు.
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
విజయవాడలోని మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని బొద్దులూరి వెంకట రామారావును హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.