/rtv/media/media_files/2025/07/18/whatsapp-message-2025-07-18-19-20-48.jpg)
WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of 46,715 rupees
ప్రస్తుత కాలంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలు ఎంచుకొని మరీ అమాయకులకు వల వేసి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగాసైబర్ నేరగాళ్లు మరో కొత్త రూట్‌ను వెతుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రూ.46,715 సాయం పొందవచ్చని.. దీనికోసం లింక్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని వాట్సాప్‌లో ఓ మెసేజ్ పంపిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు చాలామందికి వెళ్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మాత్రం.. బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులంతా ఆ సైబర్ కేటుగాళ్ల జేబులోకి వెళ్తుంది.
Also Read: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు.. సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
Financial Cyber Crime
దీన్ని పలువురు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మేసేజ్ కేంద్రం పంపుతున్నది కాదని తెలిపింది. ఆ ఫేక్ మెసేజ్‌ను నమ్మొద్దని సూచించింది. అదొక స్కామ్ అని.. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు దీనిపై PIB ప్యాక్ట్ చెక్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దని.. అలాగే ఎవరికీ షేర్ చేయొద్దని కోరింది.
Also Read:ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
Also Read : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన! రోడ్లన్నీ జలమయయం
🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸
— PIB Fact Check (@PIBFactCheck) July 18, 2025
Sounds too good to be true? Think again!
A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck
🚫 This is a SCAM!
🚫… pic.twitter.com/Fi2QKdx3UO
Also Read: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
Cyber Crime Fraud | Cyber Crime | national-news | cyber-scam | rtv-news | telugu-news