/rtv/media/media_files/2025/07/18/bangla-2025-07-18-11-06-17.jpg)
Mujib, Tagore, Satyajit Ray
ఢాకాలో షేక్ హసినా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె తర్వాత ఆర్థికవేత్త మొహమ్మద్ యూనస్ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేటపట్టారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ కు భారత్ తో ఉన్న సంబంధాలు బలహీనపడ్డాయి. యూనస్ ప్రభుత్వం అన్ని రకాలుగా భారతదేశంతో తెగతెంపులు చేసుకోవాలని అనుకుంటోంది. అక్కడ ఉన్న హిందువులు, ఆలయాలపై దాడులు, యూనస్..చైనాతో చేతులు కలపడం లాంటివన్నీ అందుకే అంటున్నారు. హిందూ మైనారిటీలపై దాడుల నివేదికలను భారతదేశం ఎత్తి చూపినప్పటికీ, న్యూఢిల్లీ తన అంతర్గత విషయాలకు దూరంగా ఉండి షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందు వేసి ఇండియాతో బంగ్లాకున్న సాంస్కృతిక సంబంధాలను, ఉమ్మడి వారసత్వాన్ని కూడా చెరిపేయాలనుకుంటోంది.
వరుసపెట్టి సాంస్కృతిక చిహ్నాలు కూల్చివేత..
భారత్, బంగ్లాల సాంస్కృతిక చరిత్రకు వారసత్వంగా ఉన్న వాటిని యూనస్ ప్రభుత్వం కూల్చేయడమే ఇందుకు నిదర్శనం. మొదట ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ పూర్వీకుల ఇంటిలో ఒక భాగం కూల్చివేశారు. ఈ ఢాకా నివాసంలోనే బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమ హీరో, అతని కుటుంబ సభ్యులు, సిబ్బంది దాదాపు 50 మందితో పాటు హత్యకు గురైయ్యారు కూడా.
దీని తర్వాత జూన్ లో బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజాద్‌పూర్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిని ఓ గుంపు ధ్వంసం చేసింది. పార్కింగ్ ఫీజు విషయంలో ఒక టూరిస్టుకు, మ్యూజియం సిబ్బందికి గొడవ అయింది. దాని తరువాత అల్లరి మూక ఠాగూర్ ఇంటి ఆడిటోరియంను ధ్వంసం చేయడమే కాక ఒక అధికారిపై దాడి చేసింది. దీంతో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రెండు సంఘటనల తర్వాత ఇప్పుడు ప్రముఖ చిత్ర నిర్మాత సత్య జిత్ రే పూర్వీకుల ఇంటిని కూల్చేస్తున్నారు. రే తాత, సాహిత్యకారుడు ఉపేంద్ర కిషోర్ రాయ్ చౌదరికి చెందిన ఈ నిర్మాణాన్ని...ప్రభుత్వం ఆమోదం తర్వాతనే కూల్చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఢాకా పురావస్తు శాఖ అధికారులు భవనాన్ని రక్షించాలని పదే పదే చేసిన అభ్యర్థనలు కూడా పెడచెవిన పెట్టారు. అంతకుముందు ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని మరమ్మతు చేయడానికి, పునరుద్ధరించడానికి భారతదేశం సహకారాన్ని అందించింది. ఇప్పుడు దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో మళ్ళీ భారత ప్రభుత్వం అడ్డుపడింది. బంగ్లా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా ఉన్న ఈ భవనం యొక్క మైలురాయి హోదాను దృష్టిలో ఉంచుకుని, కూల్చివేతను పునఃపరిశీలించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. దాన్ని మ్యూజియంగా మార్చాలని విజ్ఞప్తి చేసింది.
1974కు ముందు ఇండియా, పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా భారత్ తో కలిసే ఉండేది. కానీ బ్రిటీష్ వాళ్ళు విభజించు , పాలించు కింద బంగ్లాను భారత్ నుంచి విడగొట్టారు. దాంతో లక్షలాది మంది బెంగాలీలు తమ ఇళ్లను, పట్టణాలను, కుటుంబాలను విడిచిపెట్టి కోల్‌కతా, ఈశాన్యంలోని అనేక ప్రాంతాలలో శరణార్థులుగా జీవితాన్ని ప్రారంభించారు. అయితే బెంగాలీ సంగీతం, సాహిత్యం, సినిమాలు మాత్రం ఎప్పుడూ విభజించబడలేదు. అలాగే బెంగాల్ సాంస్కృతిక చిహ్నాలు కూడా. సత్యజిత్ రే, ఠాగూర్ లు ఎ్పటికీ ఇరు దేశాలకు చెందినవారుగానే ఉంటారు. ఈక్రంలో ఇప్పుడు వారి ఇంటికి సంబంధించి గొడవలు చెలరేగడం..బంగ్లాదేశ్భారత్ నుంచి సాంస్కతికంగా కూడా విడిపోవాలనుకుంటోందని అంటున్నారు.