/rtv/media/media_files/2025/07/18/rains-for-another-three-days-orange-alert-issued-2025-07-18-21-34-15.jpg)
Rains for another three days.. Orange alert issued
HYD RAINS : భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (శనివారం) వరకూ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
శుక్రవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మారేడ్‌పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మారేడ్‌పల్లి, బాలానగర్, బండ్లగూడ, ముషీరాబాద్‌లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోయిన్‌పల్లిలో 11.10 సెం.మీ నాచారంలో 10.05 సెం.మీ, ఉప్పల్, మల్కాజ్‌గిరిలో 10 సెం.మీ, ముసారాంబాగ్‌లో 9.8 సెం.మీ, మల్కాజ్‌గిరి అడ్డగుంటలో 9.7 సెం.మీ, బండ్లగూడలో 9.53 సెం.మీ, ఓయూలో 8.95 సెం.మీ, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బార్కాస్, కందికల్‌గేట్‌లో 8.55, అంబర్‌పేటలో 8.45, కుత్బుల్లాపూర్‌లో 8.25, ఫూల్‌బాగ్‌లో 8.15, జవహర్‌నగర్‌లో 8, బతుకమ్మకుంటలో 7.93, ఆనంద్‌బాగ్, విద్యానగర్, భోలక్‌పూర్‌లో 7.8, మెట్టుగూడలో 7.78, మాదాపూర్‌లో 7.58, కూకట్‌పల్లిలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్ రాజకీయాల్లో పెను మార్పులు