HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా

హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వ‌ర్షానికి అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వరద రావడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి స‌హాయ‌క చ‌ర్యల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.

New Update
Heavy floods in Hyderabad.. Hydra enters the scene

Heavy floods in Hyderabad.. Hydra enters the scene

 HYD RAINS : హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వ‌ర్షానికి అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. అనేక లోత‌ట్టు  ప్రాంతాల్లో న‌డుం లోతు వ‌ర‌కు వరద రావడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. ప్యాట్నీ నాలా ప‌రిధిలో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి స‌హాయ‌క చ‌ర్యల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు.  సికింద్రాబాద్ ప్రాంతలోని పైగా కాలనీ నీట మునిగింది. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమ‌ర్జన్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగి స‌హాయ‌క చ‌ర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్‌ పల్లి, హాఫిజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది.

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

 ప్రతి ఏటా వ‌ర్షాకాలం వస్తే చాలు పలు కాలనీలో నీట మునుగుతున్నాయి. అలా  నీట మునుగుతున్నాయ‌ని ఫిర్యాదుల నేప‌థ్యంలో ప్యాట్నీ నాలా విస్తర‌ణ‌కు హైడ్రా చ‌ర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నాలా విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న  ఓ ఇంటి య‌జ‌మాని ప‌నుల‌ను అడ్డుకోవ‌డంతో పనులు ఆగిపోయాయి. దీంతో గత ఏడాది మాదిరే స‌మ‌స్య త‌లెత్తింద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటితో నిండిన ఇళ్లలో చిక్కుకున్న వారిని డీఆర్ ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.  హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌ ప్యాట్నీ నాలా  ప‌రిస‌ర ప్రాంతాల్లో బోటులో ప‌ర్యటించి ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ప‌నుల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు. 

Also Read : నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

కాగా, ఇటీవల హైడ్రా పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన అంబర్‌ పేట బతుకమ్మ కుంటకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. గ‌తంలో వ‌ర‌ద నీటితో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగేవ‌ని.. ఇప్పుడు చెరువు ఆ వ‌ర‌ద‌ను ఆపుతోంద‌ని స్థానికులు చెబుతున్నారు. భారీ మొత్తంలో వ‌ర‌ద నీరు బ‌తుక‌మ్మ కుంట‌కు చేరుతోంది. భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్‌లోకి 4 అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది కార్మికులు చిక్కుకున్నారు. తమను రక్షించాలని పోలీసు, డీఆర్‌ఎఫ్‌, హైడ్రా అధికారులకు షోరూమ్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి షోరూమ్‌ వెనుక వైపు నుంచి కార్మికులను తరలించారు. బోట్ల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు.

Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు