/rtv/media/media_files/2025/07/17/husband-killed-by-wife-2025-07-17-16-34-32.jpg)
Nellore Wife Murdered Husband
నెల్లూరులో ధనమ్మ అనే మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త శీనయ్యను కడతేర్చిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. ఏకంగా వైరుతో గొంతుబిగించి భర్తను హత మార్చింది. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితురాలితో పాటు, ఆమె ప్రియుడ్ని తమదైన శైలిలో విచారించగా.. మొత్తం చెప్పేశారు.
సంచలన విషయాలు
వారు తెలిపిన విషయాల ప్రకారం.. ధనమ్మ ఫోన్ చేస్తేనే ఇంటికి వెళ్లినట్లు ప్రియుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న శీనయ్యను వైరుతో గొంతుకు బిగించి చంపేశామని నిందితుడు తెలిపాడు. ఆ సమయంలో శీనయ్య అరవకుండా అతడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేశామని తెలిపాడు. రెండేళ్ల కూతురును కూడా చంపేసి పెళ్లి చేసుకోవాలనుకున్నామని చెప్పుకొచ్చాడు.
ఏం జరిగిందంటే?
నెల్లూరు జిల్లా రాపూరు దళితవాడకు చెందిన శీనయ్యకు రెండేళ్ళ క్రితం రాపూరు సమీపంలోని పంగళి గ్రామానికి చెందిన ధనమ్మతో వివాహం జరిగింది. అయితే దనమ్మ పెళ్లికి ముందు అదే గ్రామానికి చెందిన యువకున్ని ప్రేమించింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోంది.
శీనయ్యతో పెళ్లి అయిన తర్వాత కూడా దనమ్మ ఆ యువకుడితో తన సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విషయాన్ని తన ప్రియుడికి చెప్పడంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శీనయ్యను అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీంతో రాత్రి శీనయ్య గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి హత్య చేశారు.