/rtv/media/media_files/2025/07/17/itr-2025-07-17-16-12-15.jpg)
ITR
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు క్లెయిమ్‌లు చేస్తున్న పన్ను చెల్లింపుదారులపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కఠిన శిక్షలు తీసుకోనుంది. కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్ సహాయంతో ఐటీ శాఖలో 40,000 మందికి పైగా నకిలీ తగ్గింపులు క్లెయిమ్ చేసిన వారిని గుర్తించింది. "గ్యారెంటీడ్ రిఫండ్" పేరుతో కొందరు ఏజెంట్లు గత కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుదారుల చేత నకిలీ డిక్లరేషన్‌లు చేయిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
తప్పుడు క్లెయిమ్ చేస్తే..
ముఖ్యంగా HRA (సెక్షన్ 10(13A)), విరాళాలు (సెక్షన్ 80G), వైద్య లేదా విద్యా రుణాల వడ్డీ రేట్లు (80 సిరీస్ సెక్షన్లు) వంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ డిక్లరేషన్‌లను TDS డేటా, బ్యాంక్ రికార్డులు, ఇతర పత్రాలతో ఏఐ చెక్ చేస్తోంది. దీనివల్ల తప్పుడు ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇలా తప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తే వారికి తప్పుడు డిక్లరేషన్‌లపై పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు.
ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించాలి. మరీ తీవ్రంగా తప్పుడు పన్ను క్లెయిమ్ చేస్తే సెక్షన్ 276C కింద 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. తప్పుడు క్లెయిమ్‌లు చేసి ఉంటే ట్యాక్స్‌బుడ్డీ(Tax Buddy) వంటి ట్యాక్స్ కన్సల్టెన్సీ ప్లాట్‌ఫారమ్‌లు ఐటీఆర్, ఏఐఎస్, ఫామ్ 26AS డేటాను ఏఐ సహాయంతో చెక్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో
ఏ మాత్రం తేడా వచ్చినా కూడా వెంటనే అలర్ట్ చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఏమైనా తప్పుడు డిక్లరేషన్‌లు చేసి ఉంటే వెంటనే ITR-U (Income Tax Return - Updated) ఫామ్ నింపి తమ తప్పులను సరిదిద్దుకోవాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా
itr-filing-missed | itr-filing | income-tax