ALERT: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉంది.