CM Revanth: కేసీఆర్‌ ఎందుకు ఏడుపు, పాలమూరుకు ఏం చేశావ్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్‌ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

New Update
CM Revanth Sensational Comments on KCR

CM Revanth Sensational Comments on KCR

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ మండలం జటప్రోలులో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్ పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్‌ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.   '' కేసీఆర్‌ను పాలమూరు బిడ్డలు అక్కున చేర్చుకొని పార్లమెంట్‌కు పంపించారు. సీఎం అయ్యాక ఆయన ఈ గడ్డకు ఏం చేశారు. 

Also Read: శృంగారానికి నిరాకరించినా విడాకులు తీసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

CM Revanth Sensational Comments On KCR

శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయలేదు ఎందుకు?. జీవో 98 ద్వారా పరిహారం ఇవ్వలేదు. వాల్మీకి, బోయ సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్‌ మాట తప్పారు. ఆయన కరీంనగర్‌ నుంచి పారిపోయి పాలమూరుకి వస్తే అండగా ఉన్నాం. పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి సున్నం పెట్టారు. మాదిగ పిల్లలకు వైద్య సీట్లు వస్తుంటే మీకు దుఃఖం వస్తుందా ? ఇక్కడి ప్రజలు చేపలు పట్టుకుంటూ, చెప్పులు కుట్టుకుంటూ ఉండాలా ? మీ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా ?. ఈ జిల్లా అంటే మీకెందుకు చిన్నచూపు. కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తున్న బీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు శ్రీనివాస్‌ గౌడ్, నిరంజన్‌రెడ్డికి సిగ్గుండాలి.  

Also Read: ఓ వైపు రష్యాతో యుద్ధం..మరోవైపు ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయింది ? బీమా, జూరాల, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టల పనేమైంది ?. కేవలం కాళేశ్వరం కోసం మాత్రమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. 2019లో దాన్ని కడితే 2023లో కూలింది. ఉమ్మడి పాలమూరులో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణకై న్ని వందల కోట్లు అయిన ఖర్చు చేస్తాం. ఈ ఏడాదిలో డిసెంబర్ 9 నాటికి నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేస్తాం. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని'' సీఎం రేవంత్ అన్నారు.

Also Read :  నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

Also Read :  శ్రావణంలో లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందే పద్ధతి.. రహస్యాలు తెలుసా..?

mahabubnagar | telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు