తెలంగాణ జంతువులను చంపి ఫారెస్ట్ ఆఫీసర్లు దావత్! TG: జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్, మాంసంతో దావత్ చేసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు. ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దావత్‌పై తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. By V.J Reddy 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు.. కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై తాజాగా కోర్టు ఆమెకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. మరోవైపు KTR సైతం సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేపే సద్దుల బతుకమ్మ .. సంబరాలతో మారుమోగనున్న తెలంగాణ తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు సద్దుల బతుకమ్మ అంటే చివరి రోజు. ఈ రోజు బతుకమ్మను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేరుస్తారు. సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. By Archana 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన! తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమించింది. త్వరలో మిగతా జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతో మల్లారెడ్డి భేటీ.. రేపే రేవంత్ రెడ్డితో? తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలిసి మనవరాలి వివాహానికి ఆహ్వానిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. By Nikhil 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దిక్కుమాలిన గబ్బుమాటలు.. అందరి లెక్కలు తేలుస్తామంటూ కేటీఆర్ వార్నింగ్ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది దిక్కుమాలిన గబ్బుమాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ కందుకూరు రైతు ధర్నాలో హెచ్చరించారు. By srinivas 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక TG: సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని రకాల వడ్లకో రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోమని.. పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ మౌనం ఎందుకు? కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. అయితే.. మాటకు మాటతో వివాదాన్ని పెద్దది చేయకూడదని కేటీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. By Nikhil 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rains: తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు! తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సు ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn