Big Breaking: టాలీవుడ్ లో విషాదం..నటుడు ఫిష్ వెంకట్ మృతి

నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వెంకట్ తుది శ్వాస విడిచారని బంధువులు చెబుతున్నారు.  

New Update
fish venkat

Fish Venkat

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వెంకట్ తుది శ్వాస విడిచారని బంధువులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని చందానగర్ లో ఫిష్ వెంకట్ రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోయాయని కుటుంబ సభ్యులు చెప్పారు. రెండు కిడ్నీలు మార్చాలని...కానీ వైద్యం చేయించేందుకు డబ్బులు లేవని వెంకట్ కుమార్తె రెండు రోజుల క్రితం మీడియాకు తెలిపారు. ఎవరైనా సహాయం చేయాలన కూడా ఆమె విజ్ఞప్తి చేశారు.

వందకు పైగా సినిమాల్లో..

ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్‌. ముషీరాబాద్‌ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్‌ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి అతనిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. డైరెక్టర్ వీవీ వినాయక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకట్ వందకు పైగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్నపాటి విలన్ గా చేశారు. ఆది, దిల్, బన్ని, అత్తవారింటికి దారేది, డీజే టిల్లు లాంటి చిత్రాల్లో అలరించారు.    

Advertisment
Advertisment
తాజా కథనాలు