TG Crime : ఏడు సంవత్సరాలుగా మూసి ఉన్న ఇల్లు..బాలు కోసం వెళ్లిన యువకునికి షాకింగ్‌ దృశ్యం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 7 సంవత్సరాలుగా తాళం వేసి శిథిలావస్థలో ఉన్న ఇంటి లోపల మానవ అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమీర్​ఖాన్​ అనే వ్యక్తి 2015 లో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

New Update
Human skeleton in a haunted house

Human skeleton in a haunted house

తెలంగాణలోని హైదరాబాద్‌లో 7 సంవత్సరాలుగా తాళం వేసి ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇంటి లోపల మానవ అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి సమీపంలోని మైదానంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఆ బంతి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి సమీపంలోని పొదల్లో పడింది. ఆడుకుంటున్న ఒక యువకుడు బంతిని తీసుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అతను విరిగిన కిటికీ గుండా చూసేసరికి, ఇంటి లోపల ఒక మానవ ఎముక గూడు కనిపించింది. ఆ యువకుడు దాన్ని చూసి షాక్ అయ్యాడు. భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే మరుసటి రోజు, అది నిజంగా మానవ ఎముకనా అని తెలుసుకోవడానికి అతను అదే శిథిలావస్థలో ఉన్న ఇంటికి తిరిగి వెళ్ళాడు. దీనిని రీల్స్ చేస్తే మంచి వ్యూస్ రావడంతోపాటు, తన స్నేహితుల్నీ థ్రిల్ చేయొచ్చని ఆలోచనకు వచ్చాడు.

ఇది కూడా చూడండి: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

Human Skeleton In A Haunted House

తన సెల్ ఫోన్ తో షూట్ చేసుకుంటూ.. మీకు ఒక షాకింగ్ వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లాడు యువకుడు. ఇంటి లోపలితోపాటు, అక్కడే ఉన్న మనిషి అస్తిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ లో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో సదరు రీల్ పోలీస్‌ల వరకూ వెళ్లింది. ఆ వీడియో చూసిన హబీబ్ నగర్ పోలీసులు యువకుడెవరని ఆరా తీసి, మొత్తానికి తెలుసుకుని అతడ్ని స్టేషన్‌కు పిలిచి వివరాలు అడిగారు. విషయం తెలుసుకుని  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి యజమాని ఎవరని విచారించారు.

ఇది కూడా చూడండి: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

అయితే  పొరుగువారు ఆ ఇంటి యజమాని గత 7 సంవత్సరాలుగా విదేశాల్లో నివసిస్తున్నాడని చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు, అక్కడ ఒక మానవ అస్థిపంజరం ఉందని నిర్ధారించారు. అది అమీర్ ఖాన్(50) అనే వ్యక్తి అస్తిపంజరమని గుర్తించారు. అతడికి పెండ్లి కాలేదని, ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. అమీర్ ఖాన్​కు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నారని, వారంతా నగరంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అతని వద్దకు ఎవరూ రావడం లేదని, చనిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సంఘటన స్థలంలో ఒక సిచ్ఛాఫ్​అయిన సెల్ ఫోన్​దొరికిందని, అమీర్​ఖాన్​ 2015 లో చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు వివరించారు. అయినా పక్కనున్న వారికి కూడా ఈ విషయం తెలియక పోవడం సంచలనంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా

Also Read :  'ఆంధ్రాకింగ్' నుంచి లవ్ సాంగ్ .. అనిరుధ్ వాయిస్ అదిరింది!

 skeletons | dead-body | crime news telugu | crime news today | hyderabad | nampally | crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు