Russia-Ukraine War: నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

ఇటీవల నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ముందు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.

New Update
FotoJetUkrainian sabotage suspected as Russian soldiers die from poisoned water in Donetsk (9)

Ukrainian sabotage suspected as Russian soldiers die from poisoned water in Donetsk

మూడేళ్ల కిత్రం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ.. మరోవైపు ఇరుదేశాలు ఒకదానికొకటి తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఇటీవల ఫ్రంట్‌లైన్‌లో ఉన్న నలుగురు రష్యా సైనికులు తోటి సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు విషం కలిపిన నీళ్లు తాగడం వల్లే ఇలా మృతి చెందినట్లు తెలిసింది. దీంతో రష్యా సైనికులు ఇప్పుడు నీళ్ల భయం పట్టుకుంది. ఆ నీళ్లు తాగిన చాలామంది సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. 

Also Read: మీ ఫోన్‌కి ఈ మెసేజ్‌ వచ్చిందా ?.. బ్యాంక్ ఖాతా ఖళీ అయిపోతుంది జాగ్రత్త..

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

Russia-Ukraine War

ఇక వివరాల్లోకి వెళ్తే.. రష్యా ఆక్రమిత డొనెట్క్స్ ప్రాంతంలో అవర్‌ వాటర్‌ పేరుతో నీళ్ల బాటిళ్లు మానవతా సాయం కింద వచ్చాయని పలు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్రిమియాలో సిమఫెరోపోల్ నుంచి వీటిని పంపించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ బాటిళ్లు ఎవరు పంపారు ? వాటిలో విషం కలిపింది ఎవరు ? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.  

అయితే ఈ కుట్ర వెనుక ఉక్రెయిన్‌ ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. సిబ్బంది కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయం, సరకుల రవాణాకు అంతరాయం కలిగించేందుకే ఈ కోవర్ట్‌ ఆపరేషన్‌కు పాల్పడ్డారని రష్యా మిలిటరీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్‌ మాత్రం రష్యా ఆరోపణలను ఖండిస్తోంది. సైనికుల డ్రగ్స్‌ వినియోగాన్ని దాచేందుకే రష్యా అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు.. సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

మరోవైపు రష్యా.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. శుక్రవారం ఏకంగా 500 కేజీల భారీ గ్లైడ్‌ బాంబుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మృతిచెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా గురువారం ఉక్రెయిన్ రష్యాపైకి 100కి డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. 

ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

telugu-news | Russia-Ukraine War | international

Advertisment
Advertisment
తాజా కథనాలు