/rtv/media/media_files/2025/01/22/fFudwVwTuK7mXJNSBWu1.jpg)
Telangana High Court
New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను సూచించగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
రాష్ర్టపతి ఆమోదముద్ర వేసిన ఆరుగురిలో తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ రేణుక ఎర్రా, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి ఎడ, జస్టిస్ మధుసూధనరావు బొబ్బిలి రామయ్యలను నియమించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావులను నియమించింది.
Also Read: ఎయిర్‌పోర్టులో మహిళా ప్రయాణికురాలు అరెస్టు.. లోదుస్తుల్లో లైటర్స్
ఈ నెల 25న ప్రమాణస్వీకారం..
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు పలువురు న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమైంది. నియామకం కోసం పలువురు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్స్ చేసింది. కాగా ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు వీరి నియమాకానికి సంబంధించి బుధవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 28 మంది మాత్రమే ఉండగా తాజాగా మరో ఇద్దరినీ నియమించడంతో ఈ సంఖ్య 30కి చేరింది. అయినా మరో ఏడు పోస్టులే ఖాళీగానే ఉన్నాయి. ఇటు తెలంగాణలోనూ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం మరో నలుగురిని నియమించారు.. కాగా కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?
Also Read: గుడ్‌న్యూస్.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్