Hyderabd Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దయచేసి బయటకు రాకండి!

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.  ఈ వర్షం కారణంగా మాదాపూర్, మలక్‌పేట్‌, మూసారంబాగ్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. దీంతో రహదారిపై వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

New Update
Heavy rain in Hyderabad on high alert

Heavy rain in Hyderabad on high alert

హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.  ఈ వర్షం కారణంగా మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. మలక్‌పేట్‌, మూసారంబాగ్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. దీంతో రహదారిపై వాహనదారులు, పాఠశాలల నుంచి వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్ సిటీ కొత్తగూడ ప్రాంతంలో వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాలాల నుంచి మురుగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

Also Read :  యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

Alert To Hyderabad Residents

వీకెండ్..కావడం..శని, ఆదివారం రెండు రోజులు ఐటీ ఉద్యోగులకు హాలి డేస్ కావడంతో చాలా మంది త్వరగా ఇంటికి వెళ్లాలనే తాపత్రయంతో వర్షం పడుతున్నా.. రోడ్డెక్కడంతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. చాలామంది ఊరెళ్లేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు బస్సులు, ఆటోలను ఆశ్రయించారు. అయితే ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వారంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఇటు తిరిగి ఇంటికి వెళ్లలేక, అటు ఊరికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ట్రాఫిక్ జాం అయ్యింది.. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. 

నగరంలో రోడ్లన్ని వాగులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నీళ్లు మోకాలి లోతు ప్రవహిస్తూనే ఉన్నాయి హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ తిప్పలతో వాహనదారులకు నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా.. సికింద్రాబాద్ వైపు ట్రాఫిక్ తిప్పలు దారుణంగా ఉన్నాయి. జేబీఎస్, కార్ఖానా, తిరుమల గిరి.. అల్వాల్ వైపు వెళుతున్న వారు రోడ్లపైనే చిక్కుకు పోయారు. దాదాపు రెండు కిలోమీటర్లకు మేరా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక.. మాదాపూర్, హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్ రూట్లో కూడా ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. మలక్ పేట్ యశోదా ఆసుపత్రి దగ్గర నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

Also Read :  నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌. ఆరుగురు మృతి

 లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం రూట్లో అయితే ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఎటు పోలేని పరిస్థితి నెలకొంది. మియాపూర్, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, మూసాపేట, అమీర్‌పేట, బేగంపేట, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లి, కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉప్పల్‌ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్లు తెరుచుకున్నాయి. నాచారం భవానీనగర్‌లో మోకాలి లోతు వరద నీరు ప్రవహిస్తోంది.

సికింద్రాబాద్‌, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్‌, మారేడ్‌పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్‌లో వర్షం పడింది. మణికొండ, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, గండిపేట్‌, నార్సింగి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు .జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి వరకు భారీ వర్షం కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

Also Read :  నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

hyderabad-rains | hyderabad rains today | heavy-rain-in-hyderabad | heavy rain fall | ap heavy rain warning | heavy rain alert to telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు