/rtv/media/media_files/2025/07/18/youtube-2025-07-18-21-29-17.jpg)
Youtube
ప్రస్తుతం యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల చాలామంది పెరిగిపోయారు. దీనివల్ల కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసి వీడియోలు చేసేవాళ్ల వీడియోలకు చాలా తక్కువగా వ్యూస్ వస్తుంటాయి. సబ్‌స్క్రైబర్లు కూడా చాలా నెమ్మదిగా వస్తుంటారు. ఇలా వ్యూస్ రాకపోవడంతో కంటెంట్ క్రియేటర్ల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది. చివరికి ఛానెల్‌ను వదిలేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఇలాంటి వారి కోసమే యూట్యూబ్ ఓ అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లు చేసే వీడియోలు ఎక్కువమందికి చేరేందుకు హైప్ పేరిట ఓ కొత్త సదుపాయాన్ని భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుంది ?
ఈ హైప్ ఫీచర్ అనేది 500 నుంచి 5 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు కలిగిన కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే పనిచేస్తుంది. దీనికి అర్హత సాధించిన ఛానెల్స్‌లో కింది భాగంలో కొత్తగా హైప్ అనే బటన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొన్ని వీడియో పాయింట్స్ యాడ్ అవుతాయి. దీనివల్ల మీరు చేసే వీడియో ఎక్కువ మందికి యూజర్ల స్క్రీన్‌పై కనిపించేలా సాయపడుతుంది. ఒకసారి హైప్ పొందిన వీడియో అనేది పాయింట్ల ఆధారంగా టాప్ 100 జాబితాలోకి వెళ్తుంది. దీంతో యూట్యూబ్‌లోని ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో హైప్ వీడియోల లిస్ట్ కనిపిస్తుంది. ఛానల్స్‌లో తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉండే క్రియేటర్లకు ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలనే ఉద్దేశంతో యూట్యూబ్ కొన్ని బోనస్ పాయింట్లను అందిస్తుంది
ఈ ఫీచర్ ఎలా పొందాలి
ఈ ఫీచర్ రావాలంటే 500 నుంచి 5 లక్షల వరకు సబ్‌స్క్రైబర్లు ఉండాలి. ఈ ఛానల్స్‌కు ఎలాంటి సెటప్ లేకుండానే కింద హైప్ కనిపిస్తుంది. హైప్ పొందాలంటే ఆ వీడియో కనీసం ఏడు రోజుల్లోపు అప్‌డేట్ అయి ఉండాలి. వ్యూయర్స్ సైతం తాము చూసే వీడియోలకు హైప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లైక్, షేర్ ఆప్షన్ లాగే.. లైక్ కింద హైప్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయొచ్చు. ఒక వారంలో 3 ఫ్రీ హైప్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యూయర్స్ ఇచ్చే హైప్ బటన్ ఆధారంగానే ఆ వీడియో లీడర్ బోర్డులో పైకి వస్తుంది. చివరికి యూట్యూబ్ రికమెండేషన్‌లో యూజర్లకు కనిపిస్తుంది. దీనివల్ల చిన్న క్రియేటర్లు కూడా ఎక్కువ సాధించి.. ఎక్కువ సబ్‌స్క్రైబర్లను సంపాదించే అవకాశం ఉంటుంది.