Simhadri Appanna Temple: సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి
విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలింది. షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు.