/rtv/media/media_files/2025/07/18/masood-azhar-2025-07-18-16-25-01.jpg)
Masood Azhar
అంతర్జాతీయ ఉగ్రవాది, భారత మోస్ట్ వాంటెంట్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ఎక్కడున్నాడనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. పాకిస్థాన్ కూడా తమకు తెలియదని చెప్పుతోంది. కానీ తాజాగా దాని దొంగబుద్ధి మరోసారి బయటపడింది. మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చిచెప్పాయి. అతడు పీవోకే పరిధిలోని గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో సంచరించినట్లు తాజాగా పేర్కొన్నాయి. బహవల్పూర్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో మసూద్ ఉంటున్నట్లు అతడి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది.
Also Read: ఒమన్‌లో కొత్త వర్క్ రూల్.. ఆ పని అందరూ చేయాల్సిందే
Also Read : కారులో వృద్ధుడిని కట్టేసి.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఫ్యామిలీ!
Masood Azhar Seen In POK
మసూద్ ఇటివల అజాయర్ స్కర్దూ, సద్‌పారా ప్రాంతాల్లో కనిపించినట్లు కూడా ఇంటెలిజెన్స్ పేర్కొంది. అక్కడ కొన్ని ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌసుల్లోనే అతడు కనిపించినట్లు తెలిపింది. ఇదిలాఉండగా ఇటీవల పాక్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ.. మసూద్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమదేశంలో మసూద్ లేడని అన్నాడు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్ సమాచారం అందిస్తే తాము సంతోషంతో అరెస్టు చేస్తామంటూ బుకాయించాడు. మరి ఇప్పుడు పాకిస్థాన్.. మసూద్‌ను అరెస్టు చేస్తుందా ? లేదా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు.. బీజేపీలోకి ఉద్ధవ్ ఠాక్రే ?
ఇదిలాఉండగా.. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో మసూద్ అజార్ కీలక పాత్ర పోషించారు. 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిని ఇతడే వెనుక నుంచి నడిపించాడు. అలాగే దేశం ఉలిక్కిపడేలా చేసిన మరో ఘటన 2019లో పుల్వామా ఉగ్రదాడి. దీని వెనుక కూడా మసూద్ కీలక పాత్ర పోషించాడు. అందుకే భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా మసూద్ అజార్ కొనసాగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు నిఘా వర్గాలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read : భారత అమ్ములపొదిలో మరో ఆయుధం.. ఏకే 203... దీని ప్రత్యేకత ఏంటంటే?
pakistan | rtv-news