Bomb Threat: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపు

మ‌హారాష్ట్ర‌ ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉందట.

New Update
bomb threat email

Bombay Stock Exchange

మ‌హారాష్ట్ర‌ ముంబైలో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వ‌చ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కామ్రేడ్ పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో ఉన్న మెయిల్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వెంటనే పోలీసుల‌కు ఈ స‌మాచారాన్ని చేర‌వేశారు. బాంబు స్క్వాడ్ బృందాలు, పోలీసులు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో త‌నిఖీలు చేశారు. అనుమానిత వ‌స్తువుల‌ను గుర్తించ‌లేదు.

Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!

Bomb Threat

ఈ విషయంలో ముంబైలోని రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. అయితే, ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలు కీలక సంస్థలు, ఆసుపత్రులు, కళాశాలలు, ప్రముఖుల నివాసాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా బెదిరింపులపై సమగ్ర విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు.

bomb-treat | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు