Gujarat Bridge Collapse: గుజరాత్లో కుప్పకూలిన మరో వంతెన.. ముగ్గురు మృతి
గుజరాత్లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వంతెన కుప్పకూలింది. వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు.