/rtv/media/media_files/2025/04/21/zg7mJTx5LhCxxPBqjlbD.jpg)
zodiac signs
zodiac signs in 2025 :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే గ్రహాలు ఒకదానికొకటి సంయోగం చెందటం వల్ల కూడా అనేక యోగాలను ఏర్పరిచి 12 రాశుల వారి జీవితాలను నిర్ధారిస్తాయి. ఇక కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
జూన్ లో షడష్టక యోగం
జూన్ నెలలో ఏడవ తేదీన కుజుడు కర్కాటక రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశించి, మీన రాశిలో ఉన్న శనితో కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. సహజంగా ఇది అశుభ యోగం. జ్యోతిష శాస్త్ర గణన ప్రకారం జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కుజుడు, శని కారణంగా ఏర్పడుతున్న షడష్టక యోగం ప్రభావం ఉంటుంది.షడష్టక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.
మీన రాశి
మీన రాశి జాతకులకు కుజ, శని గ్రహాల కారణంగా ఏర్పడే షడష్టక యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీనరాశి జాతకుల వ్యక్తిత్వం మెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది పనితీరులో మార్పులకు, పెరిగిన బాధ్యతలకు కారణమవుతుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, మీనరాశి జాతకులకు మొత్తంగా ఈ యోగం సమయంలో శుభప్రదంగానే ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు షడష్టక యోగం సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. దీని కారణంగా మిధున రాశి జాతకులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తిపరంగాను వీరికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి షడష్టక యోగం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ యోగంతో వృశ్చిక రాశి వారు గణనీయమైన విజయాలను సాధిస్తారు. ఈ యోగంతో కొత్త అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. వృశ్చిక రాశి వారికి పురోగతిని ఇస్తుంది. అయితే ఎవరికి వారికి వ్యక్తిగత జన్మ చార్టుల ఆధారంగా ఇది భిన్నంగా ఉండవచ్చు.