Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి పదేళ్ల నుంచి ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.