BIG BREAKING: NTVపై సీఎం రేవంత్ సీరియస్.. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశం
NTV వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
NTV వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
అల్లు అర్జున్- లోకేష్ కానగరాజ్ కాంబోలో ఒక పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. #AA23 2026లో షూటింగ్ మొదలవుతుంది. సంగీతం అనిరుధ్, నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ అందించనున్నారు.
నటి రాధికా ఆప్టే షూటింగ్లో రోజుకు 12 గంటలు మాత్రమే పనిచేయాలని, వారంలో ఐదు రోజులే పని చేయాలని స్పష్టం చేశారు. తల్లి కావడం కారణంగా బిడ్డతో గడిపే సమయాన్ని ప్రాధాన్యం ఇస్తూ, వృత్తిపరమైన హక్కులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభాస్ 'ది రాజా సాబ్' సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్లు సాధించింది. కొన్ని నెగటివ్ రివ్యూస్, సోషల్ మీడియా ట్రోల్స్ కు దర్శకుడు మరుతి స్పందించారు. తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద మంచిగా రన్ అవుతున్నా, హిందీ వెర్షన్ కొంచెం సవాళ్లను ఎదుర్కొంది.
గత కొన్నిరోజులుగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. ఇరాన్లో ఉంటున్న భారతీయ పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది.
మెగా ఫ్యామిలీ భోగి వేడుకలను కలిసి ఘనంగా జరుపుకుంది. నిహారిక షేర్ చేసిన వీడియోలో వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, సుస్మిత, కుటుంబ సభ్యులు దోశలు వేసి, సరదాగా పండగను ఆస్వాదించారు. చిరంజీవి సినిమా “మన శంకరవరప్రసాద్ గారు” విజయంతో సంబరాలు మరింత ప్రత్యేకం అయ్యాయి.
సంక్రాంతి పండగ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉన్నా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ప్రతి ఏడాది సంక్రాంతిని డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు.
విదేశాల్లో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కెనడాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. మృతుడు పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా (48)గా గుర్తించారు.
యష్ “టాక్సిక్” టీజర్‌కు భారీ స్పందన వస్తుండగా, ఇంటిమేట్ సీన్‌పై వివాదం చెలరేగింది. ఆ సీన్లో నటించిన బ్రెజిలియన్ మోడల్ బియాట్రిజ్పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. సెన్సార్ బోర్డు టీజర్ తమ పరిధిలోకి రాదని తెలిపింది.
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. నటుడిగా కాకుండా నిర్మాతగా కూడా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. భోగి సందర్భంగా నిర్మాత విశ్వ ప్రసాద్‌ను కలసి ప్రాజెక్టులపై చర్చించారు. సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్లో విడుదలైన చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” భారీ విజయాన్ని సాధించింది. రెండు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిరంజీవి హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ నిర్వహించారు.
సంక్రాంతి సీజన్లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభం సాధించింది. రెండు రోజుల్లో రూ.120 కోట్లకు పైగా వసూలు చేసి, బుక్‌మైషోలో భారీ టికెట్ అమ్మకాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మంత్రి, IAS అధికారులను టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు అదుపులోకి తీసుకున్నారు.
థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రూ. 2,500 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఇన్నాళ్లూ నిధులు లేక.. గ్రామ సమస్యలను తీర్చలేక సతమతవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది.