/rtv/media/media_files/2026/03/09/indian-stock-markets-2026-03-09-09-41-10.jpg)
భారత స్టాక్ మార్కెట్(indian-stock-market) చరిత్రలో మరో బ్లాక్ మండే(Black Monday) నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో దలాల్ స్ట్రీట్ వణికిపోయింది. సోమవారం (మార్చి 9, 2026) ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది. నేడు ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి.
సెన్సెక్స్: ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 2,177 పాయింట్లు పతనమై 76,741 స్థాయికి పడిపోయింది. - sensex-crash-today
నిఫ్టీ: నిఫ్టీ(nifty) సుమారు 650 పాయింట్లు నష్టపోయి 24,000 కీలక మద్దతు స్థాయి కంటే దిగువకు (23,802 వద్దకు) చేరింది.
Also Read : భగ్గుమంటున్న చమురు ధరలు.. 100 డాలర్లు దాటిన బ్యారెల్
బ్యాంకింగ్ షేర్లలో వణుకు
నేటి మార్కెట్ పతనంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 4 శాతానికి పైగా నష్టపోయింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం, వడ్డీ రేట్లపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా 2-3 శాతం మేర నష్టపోయాయి.
పతనానికి కారణాలు
మార్కెట్ ఈ స్థాయిలో కుప్పకూలడానికి ప్రధానంగా నిపుణులు మూడు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నేరుగా దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భయాందోళనలు రేకెత్తించింది.
ముడిచమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 105 డాలర్లు దాటేసింది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో సరఫరాకు ఆటంకం ఏర్పడటమే దీనికి కారణం. ఇది భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రూపాయి బలహీనత: ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావంతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 92.20 వద్దకు పడిపోయింది. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FIIs) అమ్మకాలను మరింత వేగవంతం చేసింది.
Also Read : Samsung Galaxy S26: 10-బిట్ డిస్‌ప్లే లేదు.. సామ్‌సంగ్ క్లారిటీ!
ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ఒక్కరోజే ఇన్వెస్టర్లు దాదాపు 8-10 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. రియల్టీ, మెటల్, ఆటో రంగాలు కూడా భారీగా నష్టపోయాయి. కేవలం ఐటీ రంగం స్వల్పంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉంది.
Follow Us