Dhulipalla Narendra: ఊసరవెల్లి.. నన్ను ఏం పీకలేవ్ రా..

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 33 రోజులు జైల్లో పెట్టినా ఒక్క తప్పు చూపించలేకపోయారని, తిరుమల లడ్డూ కల్తీ, నెయ్యి అక్రమాలు లాంటి సమస్యలన్నీ వైసీపీ నేతల వల్ల జరిగాయని అన్నారు.

New Update
Dhulipalla Narendra

Dhulipalla Narendra

Dhulipalla Narendra: టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనను గత ప్రభుత్వ హయాంలో 33 రోజులు జైల్లో పెట్టి, సంగం డెయిరీ సర్వర్లు, లెక్కలపై ఉన్న అన్ని అణువణువూ వెతికినా తనపై చిన్న తప్పు కూడా చూపించలేకపోయారని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నుండి దూరం కావడానికి ఇతరులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీలో జంతువుల కొవ్వు ఉండడం, NDDB నివేదిక కూడా అదే చెబుతుందని ధూళిపాళ్ల గుర్తు చేశారు. మార్కెట్‌లో బటర్ ధర రూ. 360, కానీ నెయ్యి కేవలం రూ. 316కి సరఫరా చేయడం ఎలా సాధ్యమో ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసినవారు వైసీపీ నాయకులే అని ఘాటుగా పేర్కొన్నారు. అక్రమ సొమ్ము విజయవాడకు రూ. 12.5 కోట్లు, చెన్నైకి రూ. 7.5 కోట్లు వెళ్ళాయని SIT నిర్ధారించింది.

సంగం డెయిరీ నాణ్యత, టెండర్ వివరాలు

సంగం డెయిరీ 2020 నుండి TTD నెయ్యి టెండర్ల కోసం ప్రయత్నిస్తోందని, అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత మాత్రమే టెండర్ దక్కిందని చెప్పారు. చంద్రబాబు గారు టెండర్ ఇవ్వకపోవడం వల్ల ఆలస్యం అయ్యిందని, ఇప్పుడు నెయ్యి సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థ ఒక్క నెయ్యి పూస కూడా TTDకు సరఫరా చేయలేదని చెప్పారు. సంగం డెయిరీ, అమూల్ తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యున్నత నాణ్యత ఉత్పత్తులు అందించగల సంస్థ అని ధూళిపాళ్ల సవాల్ విసిరారు. పవిత్రమైన తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వైసీపీ నేతలు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. “కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే, చివరికి భూమిలో కలిసిపోతారని” హెచ్చరించారు. ఫేక్ బ్రతుకులు, వెబ్‌సైట్లను డౌన్ చేయడం, మార్పింగ్ వంటి చర్యలకు వైసీపీకి పేటెంట్ హక్కు ఉన్నదని అన్నారు.

Advertisment
తాజా కథనాలు