/rtv/media/media_files/2026/03/09/fia-2026-03-09-16-58-30.jpg)
FIA Honors Women Leaders at 8th International Women’s Day 2026 in New York
అమెరికాలో భారతీయ డయాస్పోరాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' (FIA) ఆధ్వర్యంలో 8వ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మార్చి 6 న న్యూయార్క్ సిటీలోని 'ఇండియా హౌస్'లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న భారత సంతతి మహిళలను ఘనంగా సత్కరించారు. వ్యాపారం, మీడియా, ఫైనాన్స్ వంటి రంగాల్లో సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను గౌరవించారు.
జనవరి 1, 2026న FIA అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ అక్కపల్లి, మహిళా నాయకత్వానికి తమ సంస్థ అందిస్తున్న బలమైన సపోర్ట్‌ను చాటిచెప్పారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకొస్తున్న మహిళా మూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరపైన న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ అంబాసిడర్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడారు. దేశ పురోగతిలో మహిళా సాధికారత కీలకమన్నారు. భారత్‌లో అమలు అవుతున్న ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘ఉజ్వల యోజన’ వంటి పథకాల గురించి మాట్లాడారు. మొత్తంగా 9 మిలియన్ల మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా 100 మిలియన్ల గృహాలను ఆర్థికంగా అనుసంధానిస్తున్నట్లు పేర్కొన్నారు.
పురస్కార గ్రహీతలు వీళ్లే
డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్: కమ్యూనిటీ నిర్మాణంలో FIA కృషిని కొనియాడుతూ, తన తల్లిదండ్రుల ధైర్యం, భర్త సహకారాన్ని గుర్తుచేసుకున్నారు.
టానియా కిన్సెల్లా (NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్): ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం చేస్తూ.. తరతరాలుగా మహిళలు అడ్డంకులను ఎలా అధిగమిస్తున్నారో వివరించారు.
రేష్మా శెట్టి (నటి): మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి తన భావాలు పంచుకున్నారు.
మోనాలిసా శుభదర్శిని: కాన్సుల్ జనరల్ భార్య అయిన ఈమె కూడా ఈ గుర్తింపు పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Follow Us